ఎమ్మెల్యేల జంపింగ్ నేపథ్యంలో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..?

-

తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా గాంధీభవన్ బాట పడుతుండడంతో.. పార్టీని బతికించుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ తన మైండ్ కు పని చెప్పి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. గోడ దూకిన ఎమ్మెల్యేల విషయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారట.. వలస పక్షులకు చెక్ పెట్టే దిశగా ఆయన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తుంది… సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సమాంతరంగా నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ఆయన ఆలోచనలు ఉన్నాయట..

ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా చేజారుతూ ఉండడంతో బి ఆర్ ఎస్ విలవిలలాడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఇప్పుడు జంపింగ్ జపాంగ్ ల టైం నడుస్తోంది.. పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.
కాంగ్రెస్ గూటికి ఒక్కొక్కరగా చేరుతున్నారు. 2014, 2019లో అధికారాన్ని చేజిక్కించుకున్న బిఆర్ఎస్.. అప్పట్లో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను లాక్కుంది.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము వెళ్తున్నామని కొందరు చెప్పినా.. ఎక్కువమంది మాత్రం బిఆర్ఎస్ నేతల ఒత్తిడితోనే పార్టీలో చేరారనే ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది.. అలా పార్టీ ఫిరాయించి గులాబీ తోటలోకి వచ్చిన ఎమ్మెల్యేలకి కెసిఆర్ గత ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు.. అందులో కొందరు గెలిచారు.. మరి కొందరు ఓడిపోయారు.. గెలిచిన వారిని కట్టడి చేసేందుకు గులాబీ నాయకత్వం తలలు పట్టుకుంటుంది..

అధికారంలో ఉన్న సమయంలో వలసలను ప్రోత్సహించిన కేసీఆర్ ఇప్పుడు అదే వలసల తో విలవిలలాడుతున్నారు. పార్టీ సింబల్ తో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఒక్కొక్కరుగా హస్తం గూటికి వెళుతూ ఉన్నారు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా భారీగా చేరికలు ఉంటాయనే ప్రచారం గులాబీ నాయకత్వానికి నిద్ర పట్టనివ్వడం లేదట.. దింతో కెసిఆర్ మాస్టర్ ప్లాన్ వేశారట..పార్టీని వీడిన ఎమ్మెల్యేలని ఇక పార్టీలోకి చేర్చుకునేదే లేదని పార్టీ నేతలకి చెప్పారట. ఎమ్మెల్యేలు పార్టీ మారినా కేడర్ చెక్కు చెదరలేదని.. వారి స్థానంలో కొత్త వారిని ప్రోత్సాహించాలని కెసిఆర్ భావిస్తున్నారట. మంచి నాయకుడ్ని తయారు చేయడం కేసీఆర్ కి కొత్త ఏమీ కాదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అందరూ కెసిఆర్ బొమ్మతో గెలిచిన వారేనని.. వారికి సొంత బలం లేదని బిఆర్ఎస్ నేతల మాట.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎన్నికల సమయంలో పార్టీలోకి వస్తామని అడిగినా నో ఎంట్రీ బోర్డు పెడతామని గులాబీ నేతలు చెబుతున్నారు.. మొత్తంగా తెలంగాణ రాజకీయం వలస నేతల చుట్టూ తిరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news