సూర్యాపేట హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..రంగంలోకి BSP !

-

సూర్యాపేట హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై నిరసనకు దిగింది BSP పార్టీ. సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబానికి న్యాయం జరగాలని మృతురాలి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట చేపట్టిన ధర్నాలో పాల్గొన్నానని ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మృతురాలి తల్లిదండ్రులు నినదిస్తున్నది ప్రభుత్వం ప్రకటించిన “ఆరు గ్యారంటీల” అమలు కోసం కాదు..వాళ్ళ బిడ్డల ప్రాణాలకు “గ్యారంటీ” కావాలని పుట్టెడు శోకంలో బాధాతప్త హృదయాలతో నినదిస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్‌ ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు. ఈ బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలి? అంటూ నిలదీశారు. అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు కానీ, గురుకులాలు/వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చ జరగడం లేదు.ఎందుకు? ఈ బిడ్డల ప్రాణాలకు విలువలేదా? లేక మీ బిడ్డలు ఇలాంటి సంక్షేమ హస్టళ్లలో చదవడంలేదని చర్చిస్త లేరా? ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version