నాంపల్లి అగ్నిప్రమాదానికి అదే కారణం : డీసీపీ

-

నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. మంటల తీవ్రత పెరగడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ పరిశీలించారు. అఅపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉందని.. అక్కడ కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు చెలరేగాయని తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో డీజిల్, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం వల్ల మంటలు వాటికి అంటుకుని అపార్ట్‌మెంట్‌లోని పై అంతస్తులకు వ్యాపించాయని చెప్పారు. అందులోని మూడు, నాలుగు అంతస్తుల్లో కొన్ని కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయని.. అగ్నిప్రమాదంతో పొగ వల్ల ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారని తెలిపారు. అందులో ఒక పసికందు కూడా ఉందని వెల్లడించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version