మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలపై సిపిఐ దృష్టి సారించింది. అయితే గతంలో అనేకసార్లు సిపిఐ అభ్యర్థులు మునుగోడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సిపిఐ పార్టీకి మునుగోడులో క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. ఈ నేపథ్యంలోనే తమ అభ్యర్థిని పోటీకి దింపే విషయంలో కూడా సిపిఐ సమాలోచనలు చేస్తోంది. పోటీ చేస్తే గెలవగలమా? ఒకవేళ గెలవలేని పరిస్థితి ఉంటే ఓట్ల చీలిక వల్ల బిజెపికి ప్రయోజనం కలుగుతుందా? అనే కోణంలో మల్ల గుల్లాలు పడుతుంది.
ఈ నేపథ్యంలోనే నేడు సిద్దిపేట జిల్లా సిపిఐ పార్టీ మూడవ మహాసభల్లో పాల్గొన్నారు రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడులో పోటీపై అందరితో చర్చించి మా నిర్ణయం తీసుకుంటామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు చాడ. ఈనెల 19, 20 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ మీటింగ్లో చర్చించి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామన్నారు.