తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ…కారణం ఇదే !

-

తెలంగాణ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు భేటీ ఉండనుంది. ఇవాళ సాయంత్రం తెలంగాణ నాయకులతో భేటీ కానున్నారు చంద్రబాబు నాయుడు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి నూతన అధ్యక్షులు నియామకం, భవిష్యత్ లో తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలు పై చంద్రబాబు నాయుడు తో భేటీ లో తెలుపనున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు.

కాగా, విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం అయ్యారు. గతంలో కంటే ఈ సారి ఓటింగ్ శాతం పెరగడంతో వైసీపీకి ఓటమి భయం పుట్టుకుందన్నారు. పోలింగ్‌ సరళి చూస్తే వైసీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version