ధరణి పోర్టల్ మార్పు.. కేబినెట్ సంచలన నిర్ణయం

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీలో కొనసాగిన  కేబినెట్ సమావేశం తాజాగా ముగిసింది.  దాదాపు గంటన్నర పాటు కొనసాగింది  తెలంగాణ కేబినెట్‌ సమావేశం. ధరణి పోర్టల్‌ పేరు మార్పుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్‌ను భూమాతగా మారుస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మరోవైపు ఈ భేటీలో జాబ్ క్యాలెండర్, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్ కి గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు వంటి వాటిపై చర్చలు జరిపారు. చర్చల అనంతరం నిఖత్ జరీన్, మహ్మద్ సిరాజ్కు గ్రూపు-1 ఉద్యోగం, ఇంటి స్థలాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version