సౌదీ రాజు గిఫ్ట్‌గా ఇచ్చిన చీతా గుండెపోటుతో మృతి

-

సౌదీ రాజు గిఫ్ట్‌గా ఇచ్చిన చీతా గుండెపోటుతో మృతి చెందింది. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ లో ఓ చీతా నిన్న గుండెపోటుతో చనిపోయింది. అబ్దుల్లా (15) అనే మగ చీతా చనిపోవడంతో అధికారులు పోస్టుమార్టం నిర్వహించారు. గుండెపోటుతోనే చనిపోయినట్లు నిర్ధారించారు.

సౌదీ రాజు కుటుంబీకులు జూను సందర్శించి 2012లో ఆడ, మగ చీతాలను బహుమతిగా ఇచ్చారు. ఆడ చీతా 12 ఏళ్ల వయసులో 2020లో అనారోగ్యంతో మరణించింది. అప్పటినుంచి అబ్దుల్లా ఒంటరిగా ఉంటుంది. నిన్న అది కూడా కన్ను మూసింది. దీంతో అధికారులు షాక్‌ గురయ్యారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news