బ్రేకింగ్‌ : ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తో తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు భేటీ అయ్యారు. కాసేపటి క్రితమే… ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్‌… ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీ తో సీఎం కేసీఆర్‌ చర్చించే అవకాశం ఉంది.

అలాగే తెలంగాణ రాష్ట్రానికి పెండింగ్‌ నిధులతో పటు కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ పై ఈ సమావేశం లో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నెల 1 వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్‌… నిన్న మధ్యాహ్నం 1: 48 గంటలకు వసంత్‌ విహార్‌ లో తెలంగాణ భవన్‌ నిర్మానానికి భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా… రేపు హొం మంత్రి అమిత్‌ షా తో కేసీఆర్‌ భేటీ కానున్నారు.