BREAKING : కడెం ప్రాజెక్టు లో వరద పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఆరా

-

తెలంగాణతో పాటు ఎగువన ఉన్న రాష్ట్రాల్లో సైతం వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో.. ఎగువన భారీవర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరిందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రాజెక్టులోకి 5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుండగా, అధికారులు 17 గేట్లు ఎత్తి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు లో వరద పరిస్థితిపై ఆరా తీసారు సీఎం కేసీఆర్‌. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని ఆదేశించిన సీఎం కేసీఆర్‌.. అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో, మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎంకు వివరించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి… వరద కొంత తగ్గుముఖం పట్టిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news