ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు.. జగన్‌పై నారా లోకేశ్ ఫైర్!

ఇంకెన్నాళ్లు మీరు అరాచకాలకు పాల్పడతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలోని మేకల కాపరి మర్రి శ్రీను.. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశాడు. అయితే తను కారణమయ్యాడని వైసీపీ నేత పోలయ్య కక్ష్యతో మర్రి శ్రీను ఇంటిని కబ్జా చేశాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఓటు వేయకపోతే రోడ్డున పడేయడం ఏంటని నారా లోకేశ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా అంగీకరించకపోతే.. దాడులకు, బెదిరింపులకు పాల్పడతున్నారని మండిపడ్డారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

అలాగే కందమూరుకు చెందిన దళితుడిని ఉదయగిరి నారాయణ పోలీసులు కొట్టడంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ కుటుంబానికి న్యాయం అందే వరకు పోరాటం చేస్తామని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు అన్నారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 14న చలో నెల్లూరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. నారాయణను చంపిన ప్రతి ఒక్కరినీ ఉరి తీయాలని డిమాండ్ చేశారు.