సీఎం కేసీఆర్ దేశంలోనే నిజమైన రైతు నాయకుడు – హరీష్ రావు

-

నంగునూరు మండల కేంద్రంలో నూతన మండల పరిషత్ కార్యాలయ, నూతన తహసీల్దార్ భవనాలు, బట్టర్ ఫ్లై వెలుగులో నాలుగు లేన్ల రహదారి నిర్మాణ పనులు, ఇరిగేషన్ గెస్ట్ హౌస్ భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నంగునూరు మండలంలో రూ.307 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.200 కోట్లతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు. కాళేశ్వరం నీళ్లతో వాగు అవతలి గ్రామాలకు అందేలా ఏర్పాటు చేశాంమని.. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 10వేల రూపాయలు అందిస్తామన్నారు.

జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, వడగండ్ల వానలతో 80 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని అంచనా వేశామన్నారు హరీష్ రావు. దేశంలోనే నిజమైన రైతు నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రైతు కోసం సకాలంలో ఎరువులు, కరెంట్, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో నెల రోజుల పంటను ముందుకు తెచ్చేలా అదికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పంట కోతలు ముగిశాయని.. వాస్తవానికి శ్రీరామనవమి వరకూ వరి కోతలు ముగిసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఆయిల్ ఫామ్ సాగులో నంగునూర్ మెరుగ్గా ఉందన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు అన్నీ రకాల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తున్నదని.. ఆయిల్ ఫామ్ కోసం బడ్జెట్లో వెయ్యికోట్ల రూపాయలు పెట్టామన్నారు. సిద్దిపేట తరహాలో నంగునూరులో నాలుగు లేన్ల రహదారి బట్టర్ ఫ్లై లైట్లతో జిగేల్ జిగేల్ మనేలా లైటింగ్ ఏర్పాట్లు చేయబోతున్నామని తెలిపారు. ముండ్రాయి, ఆంక్షాపూర్, నాగరాజుపల్లి రోడ్డు మార్గం త్వరలోనే పూర్తి కాబోతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news