ఏ అధికారంతో గోదావరి – కృష్ణా అనుసంధానం చేస్తామని చెప్పావు.. ప్రధాని మోదీకి కేసీఆర్ సూటి ప్రశ్న

-

నదులు అనుసంధానంపై ప్రభుత్వం సిగ్గు పడాలి.. గోదావరి – కృష్ణా అనుసంధానం ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు. ఏ పద్దతి, ప్రాతిపదిన చేస్తారని… ఏ అధికారంతో గోదావరి-కృష్ణా- కావేరి అనుసంధానం చేస్తావని ఏ అధికారంతో చెప్పారని ప్రధాని మోదీని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లోకి ఎంటరైన గోదావరిలోకి వచ్చే ప్రతీ చుక్కపై అధికారం తెలుగు రాష్ట్రాలకే ఉంటుందని బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఉందని కేసీఆర్ అంటారు. ఇది సుప్రీం కోర్ట్కు సమానం అయిన తీర్పు అని… దీన్ని ఉల్లంఘించేందుకు ఎవరికీ అధికారం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నువ్వు మా నీళ్లు మమ్మల్ని అడగకుండా.. .గోదావరిలో ఉన్న జలాలను కావేరిలో ఏ అధికారంతో, ఏ చట్టం ప్రకారం కలుపుతారని.. ఇది జోక్ కాదా.. తెలివి తక్కువ పని కాదా అని ప్రశ్నించారు. మిగులు జలాలు ఉంటేనే ఇవ్వాలి కదా.. అని అన్నారు. తెలంగాణ పంపిన ప్రతిపాదనలను ఎందుకు క్లియర్ చేయడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశాన్ని గోల్ మాల్ చేస్తున్నారని బీజేపీని విమర్శించారు. మా ఇష్టమున్న అబద్దాలు చెబుతాం.. ఎవరిని పడితే వాళ్లని తిడతామంటే కుదరదని కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. ప్రాతిపదిక చెప్పకుండా, మాతో సంప్రదించకుండా బడ్జెట్ ప్రసంగంపై అనుసంధానం గురించి చెబుతారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news