నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌ లో ఈ సమావేశం జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఇక ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లతో పాటు, ఉన్నత అధికారులు పాల్గొననున్నారు.

కాగా,  ఇవాళ నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ వెళ్లనున్నారు. ఇక కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో జెన్​కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ కూడా వచ్చే అవకాశం ఉండడంతో.. ప్లాంటు ఆవరణలో రెండు హెలీప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. హెలీప్యాడ్ పనులను, ముఖ్యమంత్రి పరిశీలించనున్న ప్లాంటు పరిసరాలను మిర్యాలగూడ ఆర్డిఓ చెన్నయ్య, డీఎస్పీ వెంకటేశ్వరరావులు జెన్​కో అధికారులతో కలిసి పరిశీలించారు.