మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు.. ప్రపంచంతో..!

-

హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రాజీవ్ గాంధీ గారి కృషితో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. ఆ తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐటీ అభివృద్ధిని కొనసాగించారు. సైబరాబాద్ సిటీని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది అని కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది.

రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది. మా పోటీ ఏపీ, కర్ణాటకతో కాదు… మా పోటీ ప్రపంచంతో అని అన్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా హైదరాబాద్ లాంటి నగరం లేదు.. పక్క రాష్ట్రాలతో మాకు పోటీ లేదు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది అని సీఎం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news