నేడు విద్యుత్, ఆర్టీసీ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ

-

Telangana : తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పాలనలో దూకుడు పెంచారు. నేడు విద్యుత్, ఆర్టీసీ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశం కానున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

CM Revanth Reddy’s review on electricity and RTC today

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై ఆశాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో సమావేశం నిర్వహిస్తారు. విద్యుత్ శాఖ రివ్యూకు ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరు కావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి….ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామాను ఆమోదించకూడదని కూడా పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీనే పదవులకు రాజీనామా చేసిన ట్రాన్స్ కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు…ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటున్నారు. కాగా.. రేపటి నుంచే తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనుంది తెలంగాణ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version