కేంద్రానికి రాజకీయాలు తప్పితే… రైతుల మీద ప్రేమ లేదని విమర్శలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు. ‘గాలివాన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 22వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొక్కజొన్న 1,29,446, వరి 72,709 మామిడి 8,865, ఇతర పంటలు అన్ని కలిసి 17,238 ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయి. దానివల్ల వ్యవసాయం ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని రైతులు స్థిరపడే పరిస్థితికి వస్తున్నారు. అప్పుల నుంచి కూడా తేరుకుంటున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు.
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు సీఎం శ్రీ కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని చెప్పారు pic.twitter.com/mUydQlrdQX
— BRS Party (@BRSparty) March 23, 2023