రైతుబంధు పై సీఎం కీలక ప్రకటన

-

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా రైతుబంధును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు పేదల కంటేధనికులకే ఎక్కువగా న్యాయం జరిగిందనే ఆరోపణలున్నాయి. పేదలకు న్యాయం జరిగేందుకు తాము రైతుబంధు కేవలం పేదలకు మాత్రమే అందజేస్తామని గతంలో  రేవంత్ రెడ్డి ప్రకటించారు.

అందుకు తగినట్టుగానే రైతుబంధుకు పరిమితులు విధించబోతున్నట్టు వస్తున్న వార్తలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి రైతుబంధుకు సంబంధించి ఎలాంటి పరిమితి విధించలేదు అన్నారు. దీనిపై అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి రైతుబంధు పై ప్రకటన చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా వారి వివరాలను సేకరించి సాయం చేస్తామని చెప్పారు. అటు లంకె బిందెలుంటాయని వివరించారు. అటు లంకె బిందెలుంటాయని ఊహించుకొని వస్తే.. గత ప్రభుత్వం ఖజానా ను ఖాళీ చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news