కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కండకావడం తలకెక్కింది : బండి సంజయ్

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు కండకావరం తలకెక్కిందని అందువల్లే హిందూ దేవుళ్లను, రాముల వారి అక్షింతలు, ప్రసాదాలను అవమానించేలా మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విరుచుకుపడ్డారు. హిందూ దేవుళ్లను అవమానిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎమ్మెల్సీ బై పోల్ లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. శనివారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు.  మత పరమైన రిజర్వేషన్లు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తాము అన్ని వర్గాలను సమానంగా చూస్తే స్వాగతిస్తాం కానీ ఒక వర్గానికి కొమ్ముకాస్తే సహించేంది లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆమాలులో పూర్తిగా విఫలమైంది. కాలేశ్వరం తరువాత అత్యంత అవినీతి & స్కాం లకు కేర్ ఆఫ్ గా పౌర సరఫరా శాఖ మారింది. పౌరసరఫరాల శాఖ అప్పుల కుప్పగా మారింది. పౌర సరఫరాల శాఖలో అవినీతి & అప్పులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. గతంలో బిఆర్ఎస్, తాజాగా కాంగ్రెస్.. పౌర సరఫరాల శాఖ అక్రమాలకు, అవినీతికి వత్తాసు పలుకుతుంది. పౌర సరఫరాల శాఖ పై సమగ్ర విచారణ జరపాలి. పౌర సరఫరాల శాఖ మంత్రి ఆ శాఖపై నిస్మాక్షిక విచారణ చేస్తే.. ప్రజలు పాలాభిషేకం చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news