కొప్పుల హరీశ్వర్ రెడ్డి అంత్యక్రియల్లో అపశృతి

-

వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తండ్రి, మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్ రెడ్డి (78) అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. మొదటి రైండ్ మిస్ ఫైర్ అయింది. గాలిలోకి కాల్పులు కాల్చక ముందే గన్ పేలింది. జనంలో తూటా పేలినా ఎవ్వరికీ ఎలాంటి అపాయం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కొప్పుల హరీశ్వర్ రెడ్డి.. ఇటీవలే కోలుకొని ఇంటి వద్దనే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఇంట్లోనే కళ్లు తిరిగి కిందపడిపోయారు. కుటుంబీకులు సీపీఆర్ చేసినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు దృవీకరించారు. ఆయన అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్ణయించింది. కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఉప సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. దశాబ్దకాలం సర్పంచ్ గా కొనసాగారు. 1985లో టీడీపీ నుంచి బరిలోకి దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.

నాలుగు సార్లు అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1985 నుంచి 1987 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా, 1987 నుంచి 89 వరకు టీడీపీ సభ్యుడి వ్యవహరించారు. 1997 నుంచి 2000 వరకు ఆర్థిక సంస్థ చైర్మన్ గా కొనసాగారు. 2012లో బీఆర్ఎస్ లో చేరారు. హరీశ్వర్ రెడ్డికి భార్య గిరిజాదేవి, కుమారులు మహేష్ రెడ్డి, అనిల్ రెడ్డి, కుమార్తె అర్చనా రెడ్డి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news