కాంగ్రెస్, బిజెపి నాయకులు గుజరాతి గులామ్ గాల్లు: బాల్క సుమన్

-

కాంగ్రెస్, బిజెపి నాయకులు గుజరాతి గులామ్ గాల్లు అని అన్నారు ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్. పనిచేసే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని అన్నారు. చెన్నూరు మండలం పొక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ భారతి హోళీ కేరితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామం లో 44 లక్షల రూపాయలతో పలు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పోక్కురు గ్రామ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తాం. పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చెందాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గత పాలకులు చెన్నూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, కాంగ్రెస్, బిజెపి నాయకులు గుజరాతి గులామ్ గాల్లు.. ఢిల్లీ బానిసలు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news