తెలంగాణ పుట్టుకను ప్రశ్నించే హక్కు అమిత్ షాకు ఎక్కడిది: మంత్రి వేముల

-

తెలంగాణ ఏర్పాటుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విషం కక్కుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ నాయకులకు మొదటి నుంచే తెలంగాణ అంటే విద్వేషమన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి అమిత్ షా తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

ఆంధ్ర ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజును తెలంగాణ ఉద్యమకారుడిగా చిత్రీకరించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ పుట్టక గురించి తెలియని అమిత్ షాకు తెలంగాణను ప్రశ్నించే హక్కు ఎవరిచ్చారన్నారు. అమిత్ షా చెప్పిన అబద్ధాలకు మంత్రి కిషన్ రెడ్డి పక్కన కూర్చొని తల ఊపడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్న విధులపై వివరణ ఇవ్వాలని ఇచ్చిన సవాల్‌కు ఇప్పటికీ స్పందించలేదన్నారు. దమ్ముంటే సవాల్‌ను స్వీకరించాలని పేర్కొన్నారు. అలాగే కేంద్రంలో మంత్రి అమిత్ షా గురించి మాట్లాడితే ఇక్కడి బీజేపీ నాయకులకు ఎందుకు ఆవేశం వస్తుందో అర్థం కావట్లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news