జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ BRS ఎలా చెప్పింది..? : జగ్గారెడ్డి

-

బెయిల్ పై విచారణ జరుగుతున్నప్పుడు జడ్జి చెప్పే వరకు తీర్పు ఎవరికి తెలియదు. కానీ కవిత బెయిల్ పై మూడు నాలుగు రోజుల నుండి కవితకు బెయిల్ వస్తుందని BRS సోషల్ మీడియా ప్రచారం చేసింది. కేటీఆర్ రెండు రోజుల ముందే ఢిల్లీలో హడావుడి చేశారు. అయితే జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ BRS ముందే ఎలా చెప్పింది అని కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ప్రశ్నించాడు.

జడ్జి చెప్పకముందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ముందు సమాచారం వచ్చింది.
సిసోడియా, కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వడానికి ఆలోచించాయి కోర్టులు. కానీ కవితకి ఐదు నెలల్లో బెయిల్ ఎలా వచ్చింది. అయితే మేము జడ్జిని తప్పు పట్టడం లేదు. కానీ జడ్జి చెప్పక ముందే BRS చెప్పు కుంది అనేది మా వాదన. అయితే మూడు రోజుల ముందే బెయిల్ వస్తుంది అని హడావుడి చేసినందుకు ఈ విషయంలో న్యాయవ్యవస్థ కేసీఆర్ కుటుంబం పై చర్యలు తీసుకోవాలి అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news