తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్యారంటీ పేరుతో రేవంత్ సర్కార్ గారడీ చేస్తుందని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ అమలులో విఫలం చెందిందన్నారు. కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఇచ్చారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక రేవంత్ పై పోరాటానికి అంతా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పిల్లలను రెచ్చగొట్టిన గాంధీలు ఇప్పుడు ఎక్కడ అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ హుస్నాబాద్ కి వచ్చి పిల్లలను రెచ్చగొట్టి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని చెప్పిన రాహుల్ గాంధీ పథకాలు ఎక్కడా..? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మాదే అన్నారు. ఇప్పుడు వారందరూ ఎటు పోయారు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పై దేవుళ్లందరిపై ప్రమాణం చేశాడు. కానీ 100 శాతం రుణమాఫీ ఇంకా చేయలేదు అన్నారు.