తెలంగాణలో ఇవాళ కరోనా కేసులు ఎన్నంటే..?

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయ‌నే చెప్పవ‌చ్చు. గ‌డిచిన 24 గంటల్లో 52,714 క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. కొత్త‌గా 683 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదు అయిన కేసుల సంఖ్య 7,82,252 కు చేరింది. తాజాగా వైద్యారోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. క‌రోనా బారిన ప‌డి ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,104కు చేరుకుంది.

క‌రోనా నుంచి మ‌రొక 2,645 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 13, 674 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కొత్త‌గా 50,407 మందికి కొవిడ్ వైర‌స్ సోకింది. క‌రోనా ధాటికి మ‌రొక 804 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,36, 962 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారి పాజిటివిటి రేటు 3.48 శాతం న‌మోదు అయిందని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసులు 1.43 శాతం, రిక‌వ‌రీ రేటు 97.37 ఉంద‌ని ఆరోగ్య‌శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news