హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టటమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రజా సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావటమే కౌశిక్ రెడ్డి చేసిన నేరమా అని ప్రశ్నించారు. కాగా… హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది. భారత్ న్యాయ సంహిత చట్టంలో కేసు నమోదు అయిన మొట్టమొదటి ఎమ్మెల్యేగా పాడి కౌశిక్ రెడ్డి రికార్డు సృష్టించారు. నిన్న జడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారించిన తీరుపై ఫిర్యాదు చేశారు జడ్పీ సిఈవో. కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో అడ్డుకుని బైఠాయించారు ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి. ఈ తరుణంలోనే… భారత్ న్యాయ్ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221,126 (2} ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది.