దీక్షా దివస్ :కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో !

-

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఈరోజుకు పదేళ్ళు పూర్తయ్యాయి. ప్రత్యేక తెలంగాణా సాధన కోసం 29 నవంబర్‌ 2009న కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా దీక్షా దీవస్‌ స్ఫూర్తిని, జ్ఞాపకాలను, పోరాటాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల గుర్తు చేసుకున్నారు. అంతేకాదు ఈ మేరకు క ట్వీట్‌ కూడా చేశారు. “కేసీఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు దీక్షా దివస్(నవంబర్ 29, 2009) కు నేటితో పదకొండేళ్లు.

యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి, ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్షా దివస్ స్పూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదాం. కేసిఆర్ గారికి అండగా ఉందాం” అంటూ కవిత పేర్కొన్నారు. అలానే మంత్రి కేటీఆర్‌ కూడా తెలంగాణ ప్రజలకు దీక్షా దివస్‌ శుభాక్షాలు తెలిపారు. అది ఒక అపూర్వ ఘట్టమని, యావత్‌ తెలంగాణ ప్రజలను, అన్నివర్గాలను దీక్ష ఏకం చేసిందన్నారు. ఈమేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ‘దీక్షా దివస్‌-నవంబర్‌ 29. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్‌ శుభాకాంక్షలు’ అని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.   

 

Read more RELATED
Recommended to you

Latest news