ఇవాళ్టితో ముగియనున్న అభిషేక్, విజయ్‌నాయర్ ఈడీ కస్టడీ

-

దిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తులో ఈడీ, సీబీఐలు వేగం పెంచాయి. ఈనెల 14 నుంచి ఈడీ కస్టడీలో ఉన్న అభిషేక్, విజయ్ నాయర్‌లను మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నలడిగారు. ఇవాళ్టితో వీరి కస్టడీ గడువు ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు వీరిని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ విచారణ ముగియడంతో ఇప్పటికే అభిషేక్, విజయ్‌లకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. అభిషేక్, విజయ్‌ల కస్టడీ అంశంపై విచారణ జరిగే సమయంలోనే శరత్, బినోయ్‌ల బెయిల్ పిటిషన్లపైనా విచారణ జరపనుంది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు ప్రత్యేక కోర్టు ఈనెల 21న జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈడీ అధికారులు వీరిని నవంబర్ 10న అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు తీహాడ్‌ జైలులో ఉన్నారు.

 

దిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌లకు ఈనెల 21న బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు. వీరి బెయిల్ రద్దు అంశంపై ఇవాళ దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలోనే దిల్లీ హైకోర్టు అభిషేక్, విజయ్‌నాయర్‌కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సహకరించలేదని అభిషేక్, విజయ్‌నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కస్టడీలో విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news