గతంలో కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ మునిగేది.. డిప్యూటీ సీఎం సంచలన ట్వీట్..!

-

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాలు, వరదల కారణంగా నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో పరిస్థితులు తీవ్రంగానే ఉన్నాయి. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు అర్థరహితమని పేర్కొన్నారు.

ముఖ్యంగా కేటీఆర్, హరీశ్ రావు రాజకీయంగా సోషల్ మీడియాలో బతికేస్తున్నారని విమర్శించారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ పాలకుల మాదిరిగా తాము గడీల్లో పడుకోలేదని.. ప్రజల మధ్యే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉండటం వల్లనే స్వల్ప ప్రాణ నష్టం జర కూడా జరగలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కొద్దిపాటి వర్షానికి హైదరాబాద్ మునిగిపోయేదని.. జంట నగరాల్లో వరద విపత్తును ఎదుర్కొనేందుకు హైడ్రా సిద్ధం చేశామని తెలిపారు. నిరాశ్రయులకు తక్షణమే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. విపత్కర సమయంలో అర్థరాత్రి కూడా పని చేస్తూ.. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూస్తున్న విద్యుత్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Read more RELATED
Recommended to you

Latest news