బీజేపీతో పొత్తు ఉన్నా.. ఆ ఎంపీ టికెట్ మాదే.. బాంబు పేల్చిన మల్లారెడ్డి..!

-

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని తెలంగాణలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారం చేస్తోంది ఎవరనేది మాత్రం బయటకు తెలియనివ్వట్లేదు. బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఖరా ఖండీగా చెప్పేస్తున్నారు. పైగా వలసలను ఆపడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామా ఇదంటున్నారు. 8 మంది BRS ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ బీఅర్ఎస్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారు బండి సంజయ్.

రెండు పార్టీల మధ్య పొత్తుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మాట్లాడారు. బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉంటే తమ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారన్నారు. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. బండి సంజయ్ తో అయ్యేది లేదు…పొయ్యేది లేదని విమర్శించారు. మల్కాజిగిరి టికెట్ భద్రంగా వుందని.. ఒకవేళ బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉన్నా మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం తమదే అన్నారు మల్లారెడ్డి. తన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు, తమ కుటుంబం వేరని తెలిపారు. తన కుమారుడుకి టికెట్ ఇస్తే కుటుంబం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news