జిల్లాల పేర్లలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా..? : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

తెలంగాణ చిహ్నన్ని మారుస్తున్నారని వార్తల్లో చూశాం.. రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డికి జిల్లాల పేర్లలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తున్నారని వార్తల్లో చూశామని, చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని అన్నారు.

రాచరికపు ఆనవాళ్లను పూర్తిగా తొలగించాలనుకున్న సీఎం, కేబినెట్.. కొత్త లోగోలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా అమరుల స్తూపాన్ని పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, కానీ కాకతీయ తోరణాన్ని లోగో నుంచి తీసివేయాలని అనుకోవడం శోచనీయమని, కాకతీయ తోరణం రాష్ట్ర చిహ్నంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే కాంగ్రెస్ 1970లో తొలిదశ ఉద్యమంలో పోలీసులు కాల్పులో దాదాపు 370 మందిని బలి తీసుకుందని సంచలన ఆరోపణలు చేశారు. చిహ్నం విషయంలో కాంగ్రెస్ సమాధికి చిహ్నమైన చార్మినార్ ను తొలగించడం కాదని, ముస్లిం పాలకుల ఆనవాళ్లను మొత్తమే తొలగించాలని, బీజేపీ వచ్చాక ముస్లిం పాలకుల ఆనవాళ్లను తొలగించడంపై పూర్తిస్థాయిలో ఆలోచన చేస్తామని పేర్కొన్నారు.

ముస్లిం దురాక్రమణదారులు హిందువులపై అరాచకాలు చేసి పాలన సాగించారని, ఎదులాపురంను ఆదిలాబాద్ గా, లష్కర్ ను సికింద్రాబాద్ గా, ఎలగందులను కరీంనగర్ గా, పాలమూరును మహబూబ్ నగర్ గా, మానుకోటను మహబూబాబాద్ గా, ఇందూరును నిజామాబాద్ గా ముస్లిం పేరుతో మార్చారని, మరి వీటిలో రాచరికపు పోకడలు కనిపించడం లేదా? వీటిని ఎందుకు మార్చడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news