2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ గెలుచుకోవచ్చని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ గెలుచుకున్న సీట్ల కంటే మరికొన్ని సీట్లు ఎక్కువగానే వస్తాయని తెలిపారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. బీజేపీ గతంలో కన్న కాస్త మెరుగైన సీట్లు గెలుచుకుని తిరిగి అధికారాన్ని చేపట్టబోతుందని తెలిపారు.
పశ్చిమ, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పు ఏమీ కనిపించడం లేదు. కానీ పలు ప్రాంతాల నుంచి బీజేపీకి మద్దతు లభించిందని తెలిపారు. తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల సంఖ్య, ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ లేకపోయినప్పటికీ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిందని అది కాషాయ పార్టీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. గతంలోనూ బీజేపీకి 300కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు