హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

-

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సిపి సివి ఆనంద్ వెల్లడించారు. కొకైన్ సరఫరా ఢిల్లీ కేంద్రంగా నడుస్తోందన్నారు. ఎబూకా సుజీ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ దందా చేస్తున్నాడని, అతని కోసం గాలించాము కానీ దొరకలేదు అన్నారు. ఈ ముఠా దేశంలోని అన్ని నగరాల్లో నెట్వర్కులు ఏర్పాటు చేసి డ్రగ్స్ దందా చేస్తోందన్నారు. వీరు ఇంస్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ కొన్ని యాప్ ల ద్వారా డ్రగ్స్ ఆర్డర్ తీసుకుని సప్లై చేస్తున్నారని తెలిపారు.

ఒక గ్రాము 8 వేలకు కొనుగోలు చేసి 10 వేలకు అమ్మకాలు చేస్తున్నారని అన్నారు. ఇమాన్యుల్ అనే మరో కీలక నిందితుడు ఢిల్లీ కేంద్రంగా డ్రగ్స్ చేస్తున్నాడని తెలిపారు. ఇమ్మాన్యుయేల్, ఎబూకా సుజి ఇద్దరూ ఒకే గ్యాంగ్ కి చెందిన వారిగా అనుమానిస్తున్నామన్నారు. త్వరలోనే వీరిని పట్టుకుంటా మన్నారు. వీసాలు ముగిసినా ఇండియా లోనే ఉంటున్న ఈ నైజీరియాలను వారి దేశాలకు పంపుతామని అన్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న ఐదుగురిని వారి దేశాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు.

2500 మంది ఆఫ్రికాన్స్ ఉంటే అందులో 750 మంది పైగానే వీసాల గడువు ముగిసిన వారు ఉన్నారని తెలిపారు. కార్దెన్ సెర్చ్ చేసి మిగిలిన వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. వీరిపై కేసులు లేకుండా వారిని వారి దేశాలకు పంపుతున్నామని తెలిపారు. కేసులు పెడితే వారిని వారి దేశానికి పంపడానికి ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు సిపి సివి ఆనంద్.

Read more RELATED
Recommended to you

Latest news