దుబ్బాక ఎఫెక్ట్.. కాషాయ తీర్థం పుచ్చుకున్న మరో ముఖ్య అనుచరుడు..!

-

దుబ్బాక ఎన్నికల్లో గెలిచిన భాజపా దూసెకుళ్తుంది..తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేదనే మాటలు ఇక మారనున్నాయా అనే అనుమానాలు రేకెత్తున్నాయి. ఉపఎన్నికల్లో గెలిచిన భాజపా అధికార పార్టీ మీద విమర్శల వర్షం కురిపిస్తోంది. రోజులు మారాయ్.. కారు ఇక షెడ్డ్ కు వెళ్లాల్సిందే అంటూ అవకాలు చవాకాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. గ్రేటర్ పరిధిలోని కొందరు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఇదేం ఉంది ముందు ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కండువ మార్చే అవకాశం ఉన్నట్లు పార్టీశ్రేణులు అంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు వచ్చే లోపు చేరికలు ఇంకా పెరుగుతాయని కమల దళం ధీమా వ్యక్తం చేస్తుంది. దుబ్బాకలో చేసిన ప్రణాళికలనే ఇక్కడా అమలు చేయాలని పార్టీపెద్దలు భావిస్తున్నారు. అందరు కలిసి కట్టుగా పనిచేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గ్రేటర్ ఎన్నిక్లలో భాజపా సత్తా చూపించి కారు జోరు తగ్గించాలని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కాగా రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడైన కొప్పుల నర్సింహారెడ్డి బీజేపీలో చేరారు. దీంతో రేవంత్ రెడ్డి గట్టి షాక్ తగిలినట్లైంది. కొప్పుల నర్సింహారెడ్డిని కండువా కప్పి  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బీజేపీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి ఇలా వచ్చారో లేదో కొప్పులకు మంచి ఆఫర్‌ ఇచ్చింది బీజేపీ. ముషిరాబాద్ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా కొప్పుల బరిలోకి దిగనున్నారు.

కొప్పుల నర్సింహారెడ్డి బాటలోనే మరో అనుచరుడు కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం అయింది. కాసం రామ్ రెడ్డి కూడా ఈరోజు పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని సమాచరాం. కాసం రెడ్డి కన్ను గడ్డి అన్నారం టికెట్ మీద ఉన్నట్లు పార్టీలో ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇలానే కార్యకర్తలంత్త వలస బాట పడితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భాజపా జెండా ఎగరటం ఖాయమని పలువురు ఆశిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news