ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి : కేటీఆర్

-

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నిరాశను కలిగించాయని, ఫీనిక్స్ పక్షి లెక్క తిరిగి పుంజుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పార్టీ స్థాపించిన 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం లో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూసామని, అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే తమకు అతి పెద్ద గౌరవమని, ఒక ప్రాంతీయ పార్టీగా వరుసగా రెండుసార్లు అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాన్నారు.

2014లో 63 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, 2018లో 88 స్థానాలతో రెండోసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం శాసనసభలో 39 సీట్లతో 1/3 వంతు స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్నామని ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం వచ్చిన ఎన్నికల ఫలితాలు కచ్చితంగా నిరాశను కలిగించాయని, అయినా ఎప్పటిలాగే మరింత కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకుంటామన్న విశ్వాసం ఉన్నదని ఆశాభావం వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news