త్వరలోనే 57 ఏళ్లు నిండిన అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రకటించారు. పల్లె ప్రగతితో మన పల్లెలు దేశానికి ఆదర్శంగా మారాయని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు రూ.1450 కోట్లు అని మోడీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం నుండి గ్రామ పంచాయతీలకు బకాయిలు నయా పైసా లేకుండా ఇచ్చేశామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కేంద్ర నిధికి సమానంగా ప్రతి ఏటా 230 కోట్ల నిధులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని.. సొంత జాగాల్లో ఇండ్లు కట్టుకునే అవకాశం త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు.
త్వరలోనే 57 ఏళ్లు నిండిన అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు ఇస్తామని.. పల్లె ప్రగతి కార్యక్రమం సాధించిన ఫలితాలు ఢిల్లీ ని తాకాయని చురకలు అంటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ప్రగతి కొనసాగాలని సీఎం కెసిఆర్ కోరుకుంటున్నారని… టీఆర్‌ఎస్ పార్టీతోనే అభివృద్ధి అని వెల్లడించారు.