బీజేపీని వీడటంపై ఈటల రాజేందర్ క్లారిటీ

-

ఇంటింటికీ బీజేపీ పేరుతో ఇవాళ కాషాయదళం ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ ఒక్క రోజే 35 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. పోలింగ్ బూత్ అధ్యక్షుడి మొదలు…తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఒక్కొక్కరూ కనీసం వంద కుటుంబాలను కలిసేలా కార్యాచరణ రూపొందించింది. ఈ తరుణంలోనే బీజేపీకి ఊహించని షాక్‌ తగిలింది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ఈటల, రాజగోపాల్ రెడ్డి దూరం అయ్యారు.

గత కొంత కాలంగా… బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల, రాజగోపాల్‌ రెడ్డి.. ఇప్పుడు ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి కూడా దూరంగా ఉన్నారు. దీంతో వీరిద్దరూ పార్టీ మారుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలపై ఈటల స్పందించారు. బిజెపిలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ నేత ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ‘ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో నేను పాల్గొన్న. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తున్న. పార్టీ నాయకత్వంపై నాకు అసంతృప్తి లేదు. కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సిలు వెంటనే విడుదల చేయాలి. తెలంగాణలో ప్రతికార రాజకీయాలు లేవు. బిఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని వాక్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news