స్పీకర్ ను మర మనిషి అంటే తప్పా…మరమనిషి అంటేనే కేసీఆర్.. నాకు ఇంత శిక్ష వేశారు.. మరి రండ, లఫుట్, మరగుజ్జు, హౌల గాళ్ళు అన్నందుకు ఎలాంటి శిక్ష వేయాలని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్. అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన ఘటనపై ఈటల రాజేందర్ ఇవ్వాళ మీడియాతో మాట్లాడారు. నేను రాజీనామా ఇస్తా అన్నప్పుడు కనీసం కలిసేందుకు కూడా స్పీకర్ అవకాశం ఇవ్వలేదు…అసెంబ్లీ సెక్రెటరీకి రాజీనామా ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
రూమ్ కూడా కేటాయించకుండా అవమానించారు…అకారణంగా నన్ను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. బీఏసీ సమావేశాలకు కూడా మమ్మల్ని పిలవలేదు…ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనలను మాత్రమే స్పీకర్ పాటించారని ఫైర్ అయ్యారు.
రుణమాఫీ చేయకపోవడం వల్ల కొత్త రుణాలు రైతులకు పుట్టట్లేదు…దీన్ని మేము అడగాలనుకున్నాం. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీ నేతలకు రైతుల సమస్యలు అక్కర్లేదు. వారు మాట్లాడరు…కేసీఆర్ చెప్పినట్లుగానే ఈ రెండు పార్టీలు నడుచుకుంటున్నాయి…ఆర్టీసీని ముంచిందే కేసీఆర్ అని కార్మికులు అంటున్నారన్నారు ఈటల రాజేందర్. షర్మిల మంచిగా మాట్లాడటం లేదని చర్యలు తీసుకోవాలని అంటున్నారు.. అసలు కేసీఆర్ ఎప్పుడు మంచిగ మాట్లాడిండు అని నిప్పులు చెరిగారు.