కృష్ణంరాజును హీరోగా ఫైనల్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా?

-

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించిన కన్నుమూసిన సంగతి అందరికీ విదితమే. ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణంరాజు సేవలను స్మరించుకున్నారు.

కృష్ణం రాజు రౌద్ర రస రారాజుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. విభిన్న పాత్రలు పోషించిన కృష్ణంరాజు.. చివరగా తన తమ్ముడి తనయుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో కనిపించారు. కాగా, కృష్ణంరాజును హీరోగా ఫైనల్ చేసిన ప్రముఖ దర్శకుడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో కావాలని అనుకుని చెన్నైకి వెళ్లిన కృష్ణంరాజు ప్రముఖ దర్శకుడు ఆదూర్తి సుబ్బారావు వద్దకు వెళ్లారు. అక్కడ ఆయనతో పాటు కృష్ణ కూడా సినిమా ఇంటర్వ్యూకు వచ్చారట. ఆ సమయంలో వారి నటనా ప్రావీణ్యాన్ని పరిశీలించాలని తన అసిస్టెంట్ అయిన కె.విశ్వనాథ్ కు సుబ్బారావు చెప్పారట. అప్పుడు ప్యాథటిక్ డైలాగ్స్ ఇచ్చి వాటిని చెప్పాలని కృష్ణంరాజును కె.విశ్వనాథ్ అడిగారట.

ఆ డైలాగ్స్ చెప్తున్న క్రమంలోనే తన కళ్ల వెంట నీళ్లు వచ్చాయని, అది గమనించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ కృష్ణంరాజును హీరోగా ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆ తర్వాత కృష్ణంరాజు నటించిన సినిమాలు ఒక్కొక్కటిగా విడుదలై సూపర్ హిట్ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news