కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని ఉంది… ఆయనకు రాచరికం కావాలని కేసీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆయన పథకాలు అన్ని ఓట్ల కోసమే… కేసీఆర్ రాజ్యాంగం లో ఆయనకు ఓటు వేస్తేనే అన్ని ఉంటాయని ఉంటుందని నిప్పులు చెరిగారు. ఆయన రాజ్యాంగం పేదలు బతికే రాజ్యాంగం కాదని..సీఎం సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని నిన్న తెలంగాణ అడబిడ్డలు టివి లు బంద్ చేసుకున్నారని చురకలు అంటించారు.
అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యం అయిన ప్రపంచంలో నే గొప్పది అంబెడ్కర్ రచించిన రాజ్యాంగం అని.. అలాంటి రాజ్యాంగం తీసేయాలంటూ… కేసీఆర్ అంబెడ్కర్ ని అవమానించారని ఫైర్ అయ్యారు. అంబెడ్కర్ రాజ్యాంగం సాక్షిగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని.. సీఎం మాట్లాడిన బాషా జుగుప్సా కరంగా ఉందని ఆగ్రహించారు. నిన్న మాట్లాడిన మాటలు అన్ని నీకే వర్తిస్తాయి..ఎమ్మెల్యే లు, మంత్రులు ఇవన్నీ ఎందుకు ఆయన కోరిక అంత ఆయన ఆయన తరవాత కొడుకు, బిడ్డ, మనవడు అధికారంలో ఉండాలన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులు సీఎంలు కావడానికే కొత్త రాజ్యంగమని నిప్పులు చెరిగారు. Ias, ips అధికారులు ఆత్మవంచన చేసుకోలేక రాజీనామా చేశారని మండిపడ్డారు.