అన్ని పార్టీల్లోనూ కేసీఆర్ ఇన్‌ఫార్మర్లు – ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్..తెలంగాణ సీఎం కేసీఆర్ పై సంచలన వాక్యాలు చేశారు. సీఎం కేసీఆర్ అన్ని ప్రతిపక్ష పార్టీల్లోనూ ఇన్ఫార్మర్లు, కోవర్టులను పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపి వంటి పార్టీల్లో నేతల మధ్య తగవులు ఉన్నాయంటూ, వారితో కథనాలను ప్రచారం చేయిస్తారని ఈ పార్టీలకంటే చివరకు కేసీఆర్ దిక్కు అని ప్రజలు అనుకునేలా వారు ప్రచారం చేస్తారని తెలిపారు.

బుధవారం షామీర్ పేటలోని తన నివాసంలో ఈటల మీడియాతో మాట్లాడారు. తన కదలికలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిగా పెట్టారని తెలిపారు. 2018 ఎన్నికల సందర్భంగా గోల్కొండ హోటల్లో కొంతమంది ఇంటలిజెన్స్ అధికారులే టీ కప్పులు అందించారన్నారు. కొందరు పోలీసు అధికారులు కేసిఆర్ కు బానిసలుగా మారారని ఈటల ఆరోపించారు.