తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి షాక్ ఇచ్చాడు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా…ఆయనను దెబ్బకొట్టేందుకు.. రంగం సిద్ధం చేస్తున్నారు ఈటల రాజేందర్. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు ఈటెల రాజేందర్.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు అయిన తరువాత బండి సంజయ్ ఆధిపత్యం పెరిగి తమను కలుపుకుపోవట్లేదని కరీంనగర్ బీజేపీ సీనియర్ నాయకులు పొలసాని సుగుణాకర్ రావు, గుజ్జుల రామకృష్ణ రెడ్డి అలిగారు. ఈ తరుణంలోనే.. గుజ్జుల రామకృష్ణ రెడ్డి ఇంట్లో వారితో సమావేశమైయ్యారు ఈటెల రాజేందర్. అయితే.. ఈ విషయం బండి సంజయ్ వర్గానికి తెలిసింది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై బండి సంజయ్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.