కాంగ్రెస్ పార్టీలో నేతలు గెలిచినా వాళ్ళు మళ్ళీ టిఆర్ఎస్ లోకి వెళ్లిపోతారు – డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకరిద్దరు గెలిచినా, వాళ్లు మళ్లీ టిఆర్ఎస్ పార్టీ లోకి వెళ్లిపోతారని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ నియోజికవర్గం లో చేపట్టిన కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి పాల్గొన్నారు డీకే అరుణ.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ వారి అంతర్గత కుమ్ములాటలతో సరిపోయిందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేదని డీకే అరుణ విమర్శించారు. రాష్ట్రంలో తెరాస నియంత ప్రభుత్వాన్ని ఓడించాలని, తెలంగాణ లో కూడా బిజెపి అధికారంలో ఉంటే ఇక్కడి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని డీకే అరుణ అన్నారు. తెలంగాణ ప్రజలను అప్పులపాలు చేసి, కెసిఆర్ అతని కుటుంబం లక్షల కోట్లు దోచుకున్నారని డీకే అరుణ ఆరోపించారు.