ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి యనిక్ ఉండేవి వేలిముద్రలు..మనిషిని పోలిన మనుషులు ఉంటారు కానీ.. వేలిముద్రలు మాత్రం మనకు ఉన్న ఫింగర్‌ప్రింట్స్ మరొకరి ఫింగర్‌ప్రింట్స్‌తో అస్సలు మాచ్ అవ్వవు. నిజానికి వేలిముద్రలతో ఎంతపెద్ద స్కాం అయినా చేసేయొచ్చు. ఇలాంటి మాఫియా కూడా కొన్ని ఏరియాల్లో జరుగుతుంది. మనకు సినిమాల్లో చూపించినట్లు.. అయితే ఒక మనిషి వేలిముద్రలు అతను లేదా ఆమె చనిపోయాక పనిచేయవు తెలుసా..? ఎందుకు అలా..? అవే వేలిముద్రలు కదా.. బతికి ఉన్నప్పుడు తీసుకున్న ఫింగర్ప్రింట్స్కు ఆ మనిషి చనిపోయాక తీసుకున్న ఫింగర్ప్రింట్స్కి తేడా ఉంటుంది.
బతికున్నప్పుడు ఉన్నవేలిముద్రలు చనిపోయాక ఎందుకు ఉండవంటే..:
ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని శరీరం రంగు మారుతుంది. మృతి చెందిన వ్యక్తి ఎక్కువ రోజులు అయితే శరీరం అంతా కుళ్లిపోయి దుర్వాసన వస్తుంటుంది. అలాంటి సమయంలో కూడా నిపుణులు వేలిముద్రలను గుర్తించగలుగుతారు. ఈ ప్రక్రియ టెక్నాలజీ ద్వారా సాధ్యపడుతుంది. బతికి ఉన్నప్పుడు ఉన్న వేలిముద్రలు చనిపోయిన తర్వాత ఉండవు. ఎందుకంటే శరీరంతో పాటు వేలిముద్రలు కూడా మరిపోతాయట.
కానీ ఇన్వెస్ట్‌గేషన్‌లో భాగంగా బతికి ఉన్న సమయంలో ఉన్న వేలిముద్రలను, చనిపోయిన తర్వాత కూడా గుర్తించగలుగుతారని నిపుణులు అంటున్నారు.. వీటిని ఫోరెన్సిక్ నిపుణులు ల్యాబ్‌లలో గుర్తిస్తారు. ఫోరెన్సిక్ నిపుణులు జీవించి ఉన్న, చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను గుర్తించేందుకు పెద్దగా శ్రమించరు. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్‌లలో సాంకేతికపరంగా సులభంగా గుర్తించగలుగుతారు.
చనిపోయిన వ్యక్తి ఫోన్ అన్‌లాక్ చేయాలంటే..వేలిముద్రతో చేయొచ్చా..?
మీరు ఫోన్ అన్‌లాక్ చేయాలంటే చనిపోయిన వ్యక్తి వేలిముద్రలతో చేయలేరు. ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదం కారణంగా చనిపోయాడా..? బతికి ఉన్నాడా..? అనే విషయాన్ని మొబైల్ అన్‌లాక్ ద్వారా కూడా అంచనా వేయవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన వెంటనే అతని వేలిముద్రలు పూర్తిగా మారిపోతాయి. అలాంటి సమయంలో ఫోన్ అన్‌లాక్ వేలిముద్రలు మ్యాచ్ కావు. వాస్తవానికి మొబైల్ ఫోన్ సెన్సార్ కూడా ఒక వ్యక్తి వేళ్లలో నడిచే విద్యుత్ ప్రసరణ ఆధారంగా పని చేస్తుంది.
మనిషి మరణించిన తర్వాత అతని శరీరంలో ఉన్న విద్యుత్ ప్రసరణ నిలిచిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మొబైల్ సెన్సార్లు విద్యుత్ ప్రసరణ లేకుండా వేళ్లను గుర్తించలేవు. అందుకే వ్యక్తి బతికున్నప్పుడు.. చనిపోయినప్పుడు వేలిముద్రల్లో తేడాలు ఉంటాయి. మనతో పాటు వచ్చి మనతో పాటే పోయే వాటిల్లో వేలిముద్రలు కూడా ఒకటనమాట..!