రాహుల్‌ గాంధీ చెప్పిందంతా నిజం.. రికార్డుల్లోంచి ఎందుకు తొలగించారు : రేణుకా చౌదరి

-

లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సోమవారం రాహుల్‌గాంధీ చేసిన హిందూత్వ వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఫైర్‌ బ్రాండ్‌ రేణుకా చౌదరి స్పందించారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని రికార్డుల్లోంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.

రాహుల్‌గాంధీ ప్రసంగాన్ని వాళ్లు ఎందుకు రికార్డుల్లోంచి తొలగించారు..? అందులో ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు వాళ్లకు ఏం కనిపించాయి..? రాహుల్‌గాంధీ ఏదైతే మాట్లాడిండో అది కరెక్ట్‌. నేనొక హిందువుగా చెబుతున్నా.. అసలైన హిందువులు హింసను ప్రేరేపించరు’ అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు  డ్రమ్స్‌ వాయిస్తూ అది తప్పు, ఇది తప్పు అని చెప్పడం అలవాటుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. వీళ్లు డ్రమ్స్‌ వాయిస్తారు. ఇది తప్పు అంటారు. అది తప్పు అంటారు. ఆఖరికి మల్లికార్జున్‌ ఖర్గే ప్రసంగాన్ని కూడా వీళ్లు రికార్డుల నుంచి తొలగించారు. వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నారు. వాళ్ల ఇష్టమొచ్చినట్టు సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news