జగన్మోహన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నాడు – సీపీఐ నారాయణ

-

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ఓడిపోతుందని తెలుసు, అందుకే అధికారుల్ని కేడర్ ని నమ్మించటానికి విశాఖలో హడావిడి అని చెప్తున్నారని పేర్కొన్నారు. నేను విశాఖలో ఫోన్ చేశాను ఎక్కడ గదులు బుక్ కాలేదు….కౌంటింగ్ సందర్భంగా రెచ్చగొట్టే మాటల్లో కూడా ఓడిపోతారని విషయం తెలుస్తోందన్నారు.

cpi narayana

తెలంగాణలో రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నాడని ఫైర్ అయ్యారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాజిటివ్ ఆలోచనతో ఉంటే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి అయ్యేది, ఆయన మరోసారి సీఎం అయ్యేవాడని వెల్లడించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కెసిఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ రెడ్డి ఆయన నెత్తిన ఆయనే చెత్త వేసుకున్నట్టు అవుతుందని హెచ్చరించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చిహ్నం జోలికి పోకపోవడం మంచిదని సూచనలు చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news