నిండుకుండలా శ్రీశైలం జలాశయం.. 10 గేట్లు ఎత్తివేత

-

శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా కృష్ణానదికి క్రమంగా ఇన్ ఫ్లో కొనసాగుతోంది. గత రెండ్రోజులుగా కృష్ణా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలకు భారీగా వరద నీరు పొటెత్తుతోంది. దీంతో 24 గేట్లను ఎత్తిన అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుండటంతో రిజర్వాయర్ నిండుకుండలా మారింది.

పరిస్థితిని గమనించిన నీటి పారుదల శాఖ అధికారులు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది రిజర్వాయర్ గేట్లను ఎత్తడం ఇది రెండోసారి. ప్రస్తుతం శ్రీశైలం ఇన్ ఫ్లో 2,13,624 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,22,876 క్యూసెక్కులుగా ఉంది.పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 880 అడుగులకు నీటి ప్రవాహం చేరుకున్నట్లు సమాచారం. కాగా, కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news