ఓటుకు నోటులో రేవంత్ కు బెయిల్ ఇచ్చింది బీజేపీనేనా ? అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కవిత బెయిల్ పై కాంగ్రెస్ చేస్తున్న ప్రకటన లపై ట్విట్టర్ లో స్పందించిన కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. BRS & BJP పొత్తు గురించి పనికిమాలిన ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు దయచేసి గమనించండి అంటూ కొన్ని విషయాలను ప్రస్తావించారు. డిసెంబరు, 2015లో ED కేసులో సోనియా గాంధీ జీ & రాహుల్ గాంధీ ఇద్దరూ బెయిల్ పొందారని గుర్తు చేశారు.
ఇటీవల ఎన్నికలలో భారతదేశ కూటమిలో భాగమైన AAP. ఆ నేత మనీష్ సిసోడియా జీకి వారం రోజుల క్రితం బెయిల్ మంజూరైందని సెటైర్లు పేల్చారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారని గుర్తు చేశారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయి. అయితే పైన పేర్కొన్న ఉదాహరణల నుండి బిజెపి మరియు కాంగ్రెస్‌లు భాగస్వాములు అని మనం ఊహించాలా? అంటూ చురకలు అంటించారు కేటీఆర్.