తెలంగాణ ఎంపీలు, బీజేపీ నాయకులు మోడీ వాక్యాలను ఖండిస్తారా..? సమర్థిస్తారా…? దమ్ము ధైర్యం ఉంటే మీరు నిజంగా తెలంగాణ బిడ్డలైతే మీ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీలకు మంత్రి గంగుల కమలాకర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రదాని మోడీ సంప్రదింపులు అనే మాట దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని నిప్పులు చెరిగారు. 70 ఏళ్ల తెలంగాణ ఉద్యమం మీకు కండ్లకు కనిపించడం లేదా…. వేయి మందికి పైగా తెలంగాణ బిడ్డలు అమరులైంది కండ్లకు కనిపించడం లేదా అని నిలదీశారు.
విస్రుత సంప్రదింపులకోసం శ్రీక్రుష్ణ కమిటీ పనిచేసిందిగా… పదే పదే ఎందుకు తెలంగాణపై అక్కసు వెల్లగక్కుతున్నారని ఆగ్రహించారు. పవిత్రమైన పార్లమెంట్ వేదికగా తెలంగాణ ఉద్యమాన్ని, మా నేలను, మా అమరులను ఎందుకు అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు మీకు సొంతంగా ఇష్టం లేక ఇన్ని అభాండాలా ఇంత అవమానమా… మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే అవకాశం ఉన్నా తెలంగాణ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని ఫైర్ అయ్యారు.
ఎంఐఎం పార్టీతో బద్ద శత్రుత్వం అని చెప్పుకునే మీరు, మీ ఎమ్మెల్యేలు తోటి వాళ్లకు బెయిల్ ఇప్పించింది వాస్తవం కాదా అన్నారు. అభివ్రుద్ది అనేదే లేకుండా కేవలం మతం పేరుతో రాజకీయాలు చేస్తుంది మీరు కాదా…బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమా…? అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మోడీ అవమానించారని ఫైర్ అయ్యారు.