మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

-

బంగారం..ఈ పేరు వింటేనే మహిళలు ఎంతో సంతోష పడతారు. దీనికి ప్రపంచంలోనే అత్యంత విలువ ఉంది. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 52,310 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 47, 950 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 68,000 గా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news