తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్వరాష్ట్రంలో సుపరిపాలన పేరుతో ఈ కార్యక్రమం జరపనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన వికేంద్రీకరణలో సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. 2016లో 10 జిల్లాలు ఉండగా… 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపింది.
దీని ద్వారా పరిపాలన సౌలభ్యం కలిగిందని వెల్లడించింది. కాగా
2014లో సింగరేణి టర్నోవర్ రూ. 11 వేల కోట్లు ఉంటే ఇప్పుడది రూ. 33 వేల కోట్లకు చేరుకుందని సీఎం కేసీఆర్ మంచిర్యాల సభలో అన్నారు. అదేవిధంగా లాభాలు రూ. 300-400 కోట్లు మాత్రమే ఉంటే….ఈ ఏడాది రూ. 2,184 కోట్లకు పైగా లాభాలు వచ్చాయన్నారు. ఈ లాభాల వల్ల వచ్చే దసరాకు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ రూ. 700 కోట్లుగా ఉంటుందని తెలిపారు.